Saturday, October 28, 2017

Telangana State Level Police Recruitment 2017

  http://cineutsav.blogspot.com/       Saturday, October 28, 2017
Telangana State Level Police Recruitment Board
*తెలంగాణ న్యూస్*


http://tslprb.in

*26 వేల పోలీస్‌ కొలువులు నవంబర్ రెండో వారంలో నోటిఫికేషన్*

మొదట్లో 18280 పోస్టులు భర్తీ.
పోలీసు శాఖలో 26,000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ. అందులో 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు డీజీపీ.

_రెండు దశల్లో నియామకాలు_

26 వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య ఉండదని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. పోలీస్‌ శాఖ కూడా రెండు దశల్లో నియామకాలకే మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగా మొదటి దఫాలో 10 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి కోసం డీజీపీ కార్యాలయం చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది.

దీంతోపాటు ప్రస్తుతం 11 వేల మంది సిబ్బంది శిక్షణలో ఉన్నారు. వారి శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రైనింగ్‌ కాలేజీలు బిజీగా ఉన్నాయి. 11 వేల మంది సిబ్బంది శిక్షణకే సమస్యలు ఎదురవుతున్నాయని, అలాంటిది ఒకేసారి 26 వేల పోస్టులు భర్తీ చేస్తే మరింత క్లిష్టంగా మారుతుందని భావిస్తున్నారు అధికారులు. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోనుంది.
logoblog

Thanks for reading Telangana State Level Police Recruitment 2017

Previous
« Prev Post

No comments:

Post a Comment

Total Pageviews